తెలంగాణ

telangana

ETV Bharat / crime

బాసరలో విషాదం.. గోదావరిలో దూకి తల్లి, ఇద్దరు పిల్లలు మృతి - గోదావరిలో ముగ్గురుమృతి

Mother and children died
తల్లి పిల్లలు ఆత్మహత్య

By

Published : Jan 23, 2023, 2:33 PM IST

Updated : Jan 23, 2023, 4:16 PM IST

14:29 January 23

గోదావరిలో దూకి ముగ్గురు మృతి

తన ఇద్దరు పిల్లలతో మహిళ ఆత్మహత్య

Three persons died in Basara Godavari: అది రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్య క్షేత్రం. రోజు వేల మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. సాక్షాత్తు చదువుల తల్లి కొలువుదీరిన నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం వద్ద గల గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అలాంటి పవిత్ర గోదావరి నేడు మృత్యు గుండంలా మారి ఆత్మహత్యలకు అడ్డాగా తయారయింది. ఏ చిన్న కష్టం వచ్చినా నిర్మల్ జిల్లాతో పాటు చుట్టు ప్రక్కల జిల్లాల ప్రజలు బాసర గోదావరి నదిలో దూకి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఒక ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంటుంది.

ఆర్థిక ఇబ్బందులు తాళలేక తన ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నిర్మల్ జిల్లా బాసరలో జరిగింది. బాసరలోని గోదావరిలో మానస అనే మహిళ(27), తన ఇద్దరు పిల్లల బాలాదిత్య(8), నవ్యశ్రీ(7)తో సహా దూకి మృతి చెందింది. మృతులు నిజామాబాద్​ జిల్లా గోల్​ హనుమాన్​కు చెందిన వారుగా గుర్తించారు. నిజామాబాద్​లోని ఎల్వియర్ షాపింగ్ మాల్లో పని చేస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్‌ నుంచి బస్సులో వచ్చి గోదావరి వంతెన వద్ద ముగ్గురూ దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నది వద్ద గంగా హారతి ఇచ్చే ఘాట్‌ సమీపంలో పిల్లల స్కూల్‌ బ్యాగులు, ఖాళీ చేసిన టిఫిన్‌ బాక్సులను గుర్తించారు. పిల్లలకు అన్నం తినిపించిన తర్వాత వారితో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాసర పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి మృతదేహాలను బయటకు తీసి విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 23, 2023, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details