తెలంగాణ

telangana

ETV Bharat / crime

Cyber Crime : రూ.300 కోసం పోతే.. రూ.1.90లక్షలు మాయం

డెలివరీ బాయ్​ రూ.300 అదనంగా తీసుకున్నాడని సదరు ఆన్​లైన్ ఈ-కామర్స్​ కస్టమర్​ కేర్​కు కాల్​ చేయాలనుకుని.. సైబర్ నేరగాళ్లకు చిక్కింది ఓ మహిళ. రూ.300 కోసం ఫిర్యాదు చేయబోయి.. ఆ కేటుగాడి చేతిలో రూ.1.90 లక్షలు మోసపోయింది. చివరకు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరింది.

cyber crime, cyber crime in hyderabad
సైబర్ క్రైమ్, హైదరాబాద్​లో సైబర్ క్రైమ్

By

Published : Jun 6, 2021, 9:06 AM IST

మూడు వందల రూపాయల రిఫండ్ కోసం ప్రయత్నించబోయి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కిన ఓ మహిళ రూ.1.90 లక్షలు నష్టపోయింది. హైదరాబాద్​కు చెందిన ఓ మహిళ ఆన్​లైన్​లో ఓ వస్తువు ఆర్డర్ పెట్టింది. ఆ వస్తువును డెలివరీ చేసిన డెలివరీ బాయ్ రూ.300 అదనంగా తీసుకున్నాడని సదరు ఈ-కామర్స్ సంస్థకు ఫిర్యాదు చేయాలనుకుంది.

గూగుల్​లో ఉన్న కస్టమర్ కేర్​ నంబర్​కు కాల్​ చేసింది. కస్టమర్ కేర్​ ఆపరేటర్​గా మాట్లాడిన ఓ సైబర్ కేటుగాడు.. డబ్బులు రిఫండ్ చేస్తామని.. యూపీఐ, ఐడీ, పాస్​వర్డ్ తీసుకుని ఆమె అకౌంట్​లో ఉన్న రూ.1.90 లక్షలు మాయం చేశారు. మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరో కేసులో.. కొవిడ్ ఇంజక్షన్ పేరుతో ఓ వ్యక్తి వద్ద సైబర్ కేటుగాళ్లు రూ.1.6 లక్షలు కాజేశారు. ఎన్నిరకాల ఎత్తుగడలు వేసినా.. సైబర్ నేరగాళ్లు రోజుకో పంథా అనుసరిస్తూ సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రజలంతా సైబర్ వలకు చిక్కకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details