Women died for Land: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లిలో కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ కాలువ భూసేకరణ చేపడుతున్నారు. అందులో తమ భూమి పోతుందనే బెంగతో మిట్టపెల్లి రాధమ్మ అనే మహిళ గుండెపోటుతో తనువు చాలించింది. వీరికి చెందిన ఎకరం పొలం కాళేశ్వరం మూడో టీఎంసీ కాలువ కోసం చేపట్టే భూసేకరణలో ఉన్నట్లు.. అధికారులు జాబితాలో ప్రకటించారు. నెల రోజుల క్రితం భర్త రహదారి ప్రమాదంలో మృతి చెందారు.
Women died for Land: భూమి పోతుందనే బెంగతో గుండెపోటు.. - భూమి పోతుందనే బెంగతో మహిళ మృతి
Women died for Land: కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ కాలువ భూసేకరణలో తమ భూమి పోతుందనే బెంగతో ఓ మహిళ గుండెపోటుతో హఠాన్మరణం చెందింది. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.
women died for Land
దీంతో భూసేకరణలో తగిన పరిహారం లభించదనే బెంగతో పొలం పక్కనే ఉన్న షెడ్డులో కుప్పకూలి పడిపోయింది. వెంటనే ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గుండెపోటు రావటంతో అప్పటికే తుదిశ్వాస విడిచింది. ఆమె కుమారులు భివండిలో చేనేత కార్మికులుగా ఉపాధి పొందుతున్నారు. ఉన్న కొద్దిపాటి భూమి కాలువ భూసేకరణలో కోల్పోతుండటంతో కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:తెల్లవారుజామున బయటకు వెళ్లిన బాలికపై అత్యాచారం..! ఆపై హత్య