అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన... యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కలపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంతోష అనే మహిళ ఆమె ఇంటి పక్కనే ఉన్న బావిలో శవమై కనిపించింది. తన కుమార్తె మరణానికి అల్లుడే కారణమని ఆరోపిస్తూ... అతడిపై మహిళ తల్లి దాడి చేసింది.తరుచూ డబ్బుల కోసం వేధించేవాడని తెలిపింది.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కలపల్లిలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. తన కూతురు మరణానికి అల్లుడే కారణమంటూ మృతురాలి తల్లి ఆరోపించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
సంతోష మరణానికి తనకు ఎలాంటి సంబంధం లేదని... ఆమె భర్త మహేశ్వర్ తెలిపాడు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.... మహేశ్వర్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. స్థానికుల సహాయంతో బావిలో నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. శవపరీక్ష నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాల పెరుగుదలపై హైకోర్టు ఆందోళన