తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన.. వైరల్‌ ఫీవర్‌తో ? - ట్యూబెక్టమీ

Woman died: సీ సెక్షన్‌ ఆపరేషన్‌ చేయించుకున్న మహిళ చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మోడ్రన్ గవర్నమెంట్‌ మెటర్నిటీ ఆస్పత్రిలో జరిగింది. ఈమె వైరల్‌ ఇన్‌స్పెక్షన్‌తో మరణించినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

woman died
మహిళ మృతి

By

Published : Sep 8, 2022, 9:00 PM IST

Woman died: హైదరాబాద్‌లోని పేట్లబుర్జ్‌లో ఉన్న మోడరన్‌ గవర్నమెంట్‌ మెటర్నిటీ ఆసుపత్రిలో ఓ మహిళ నాలుగు రోజుల క్రితం సీ సెక్షన్‌ ఆపరేషన్‌ చేసుకుంది. ఇప్పుడు ఆ మహిళ అనారోగ్యం బారినపడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈమె వైరల్‌ ఇన్‌స్పెక్షన్‌ ద్వారా మరణించిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అందుకు సంబంధించిన రికార్డులు అన్నీ పరిశీలించామని తెలిపారు.

సీ సెక్షన్ ఆపరేషన్‌ చేసిన రెండు రోజుల తర్వాత మహిళకు వాంతులు, విరేచనాలు కావటంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమెను ఆస్పత్రిలో చేర్చిన తరవాత చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వైద్యులు స్పష్టం చేశారు. ఈ ఘనటపై డీఎంఈ రమేష్ రెడ్డి స్పందించారు.వైరల్ ఫీవర్ తోనే మహిళ మృతి చెందినట్టు ఆయన పేర్కొన్నారు.

అదే రోజు మొత్తం 9 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించారన్నారు. అందులో మరో ఇద్దరు మహిళలకు సైతం వైరల్‌ ఫీవర్ సోకినప్పటికీ వారి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు డీఎంఈ తెలిపారు. తొలుత మృతురాలికి సీ సెక్షన్ తో పాటు, ట్యూబెక్టమీ చేసినట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ట్యూబెక్టమీ వల్ల తరవాత చనిపోవడం చాలా అరుదు, వైరల్‌ ఇన్‌స్పెక్షన్స్‌ సోకితే తప్ప ఇలా అవ్వదు అన్నారు. ఈ ఆస్పత్రిలో అన్ని దావఖానాల్లో లాగానే నాణ్యమైన మందులు వాడుతున్నారని తెలిపారు. అన్ని రిపోర్టులు చూశామని దేనిలోనూ ఏవిధమైన సమస్య లేదని అన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details