నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గంజాల్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో లారీ చెడిపోవడంతో డ్రైవర్ వాహనాన్ని రోడ్డుపైనే నిలిపివేశాడు. ఆ సమయంలో నిర్మల్ నుంచి మోర్తాడ్ మండలం శేట్పల్లి గ్రామానికి వెళ్తున్న ఆటో.. లారీని గమనించకపోవడంతో వెనకాల నుంచి ఢీకొట్టింది.
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆటో.. మహిళ మృతి - nirmal road accident news
నిర్మల్ జిల్లా గంజాల్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
లారీని ఢీ కొట్టిన ఆటో
ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న భూదేవి(48) అక్కడిక్కడే మృతిచెందింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వివరించారు.
ఇదీ చదవండి:రూ.2 లక్షల విలువైన గుట్కా పట్టివేత