Kaiser nagar road accident: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను కాంక్రీట్ లారీ ఢీకొనడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కైసర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ప్రగతి నగర్‌కు చెందిన థామస్, విజయారాణి(43) ద్విచక్ర వాహనంపై అల్వాల్ వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలోని కైసర్‌నగర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కాంక్రీట్ లారీ ఢీకొట్టింది.
Kaiser nagar road accident: కైసర్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం.. భర్త కళ్ల ముందే భార్య మృతి - కైసర్‌నగర్ న్యూస్
Kaiser nagar road accident: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ జంటను కాంక్రీట్ లారీ ఢీ కొట్టిన ఘటనలో... భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం మేడ్చల్ జిల్లా కైసర్‌నగర్‌లో జరిగింది.
Kaiser nagar road accident
విజయరాణి తలపై నుంచి కాంక్రీట్ లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. థామస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:Girl kidnap attempt in AP : పదేళ్ల బాలిక అపహరణకు యత్నం.. ఆ చిన్నారి ఏం చేసిందో తెలుసా?