ఖమ్మం నగరంలోని రోటరీనగర్‌లో నివాసముండే శ్రీనివాసరావు జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతని భార్య లక్ష్మికి ఈనెల 2న ఆయాసం వచ్చింది. అదే రోజు రాత్రి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శ్రీనివాస్ తన భార్యను చేర్పించారు. రెండ్రోజులు వైద్యం చేసిన డాక్టర్లు రూ.2 లక్షలు బిల్లు వేసి వేరే పరిస్థితి విషమించిందని.. హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు.
Dead : ఆయాసం వస్తోందని ఆస్పత్రికి వెళ్తే.. ఆయువు పోయింది
ఆయాసం వస్తోందని ఆస్పత్రికి వెళ్తే ఆయువు పోయిన సంఘటన ఖమ్మం నగరంలోని రోటరీనగర్‌లో చోటుచేసుకుంది. మూడు ఆస్పత్రులు తిరిగి రూ.28 లక్షలు ఖర్చు చేసినా.. చివరకు ప్రాణం దక్కలేదు.
హైదరాబాద్‌లో మరో ప్రైవేట్ ఆస్పత్రిలో ఈనెల 4న లక్ష్మిని చేర్పించారు. 12 తారీఖు వరకు చికిత్స అందించి మరో ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారని శ్రీనివాస్ రావు తెలిపారు. ఆ ఆస్పత్రిలో రూ.12 లక్షల వరకు బిల్లు చెల్లించామని వెల్లడించారు. అక్కణ్నుంచి గచ్చిబౌలిలోని మరో కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించి ఈనెల 27వరకు చికిత్స చేయించామని చెప్పారు. అక్కడ మరో రూ.14 లక్షల బిల్లు అయ్యాక.. ఇక లక్ష్మి బతకడం కష్టమని చెప్పారు. మరుసటి రోజే ఆమె మృతి చెందింది. నాలుగు ఆస్పత్రులు తిరిగి రూ.28 లక్షలు ఖర్చు చేసినా.. తన భార్యను కాపాడుకోలేకపోయానని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యారు.