విజయవాడ మొగల్రాజపురం సున్నం బట్టిల వద్ద ఓ వివాహిత అనుమాస్పదంగా మృతి చెందింది. గతేడాది అక్టోబర్లో రేణుకకు అంజన్ కృష్ణతో వివాహం జరిగింది. రెండు నెలల అనంతరం అంజన్ కృష్ణకు మరో మహిళతో ఏర్పడిన వివాహేతర సంబంధం బయటపడింది. ఈ క్రమంలో తరచూ వివాదాలు జరిగేవని తెలుస్తోంది.
తమ కుమార్తెను అల్లుడు చిత్రహింసలకు గురిచేసేవాడని మృతురాలి తల్లిదండ్రులు అరోపించారు. భార్యను అనేకసార్లు చనిపోవాలని తిట్టే వాడని.. చివరకు చనిపోవడానికి కారణమయ్యాడని తెలిపారు.