నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం ఎల్లమ్మ రంగపూర్ గ్రామానికి చెందిన నర్సమ్మ (58) బుధవారం కల్వకుర్తి నుంచి అచ్చంపేట వెళ్తున్న బస్సులో స్వగ్రామానికి బయలుదేరింది. కల్వకుర్తి పట్టణ సమీపంలో దేవరకొండ మార్గంలో రోడ్డు పనులు జరుగుతుండగా... బస్సు డ్రైవర్ పక్కన ఉన్న వెంచర్ గుండా వెళ్తున్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు బస్సుకు 11కేవీ విద్యుత్ తీగలు తగిలాయి.
Current shock: ఆర్టీసీ బస్సుకు విద్యుత్ తీగలు తగిలి మహిళ మృతి - నాగర్కర్నూల్ జిల్లా తాజా వార్తలు
ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సుకు విద్యుత్ తీగలు తగిలి ఓ మహిళ మృతిచెందిన ఘటన... నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చోటుచేసుకుంది. మృతురాలు ఆ సమయంలో బస్సులోంచి దూకేందుకు ప్రయత్నించడంతో విద్యుదాఘాతం సంభవించినట్లు పోలీసుల తెలిపారు.
![Current shock: ఆర్టీసీ బస్సుకు విద్యుత్ తీగలు తగిలి మహిళ మృతి woman dead with electric shock, electric shock to RTC bus in Kalwakurthy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12315217-76-12315217-1625066872952.jpg)
ఆర్టీసీ బస్సుకు విద్యుత్ తీగలు తగిలి మహిళ మృతి, విద్యుదాఘాతంతో మహిళ మృతి
ఆర్టీసీ బస్సుకు విద్యుత్ తీగలు తగలడంతో వెంటనే బస్సుపైన మంటలు చెలరేగాయి. అది చూసి కంగారు పడిన నర్సమ్మ... బస్సులోంచి దూకేందుకు ప్రయత్నించడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: Zonal line clear: జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులకు కేంద్రం ఆమోదం