యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బొందుగుల గ్రామంలోని ఓ ఆర్ఎంపీ వైద్యుడి వద్ద చికిత్స పొందిన నవనీత అనే మహిళ మృతి చెందింది. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే మహిళ చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనారోగ్యానికి గురైన నవనీతను వెంకటేశ్వర క్లినిక్కి తీసుకొచ్చామని తెలిపారు. ఆర్ఎంపీ డాక్టర్ పుట్ట బాలనర్సింహ నిర్లక్ష్యంతో వైద్యం వికటించి మహిళ మృతి చెందిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఆస్పత్రి ముందు మహిళ కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఆందోళన విరమింపజేశారు.
వైద్యం వికటించి మహిళ మృతి - తెలంగాణ వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా బొందుగుల గ్రామంలో వైద్యం వికటించి మహిళ మృతి చెందింది. అనారోగ్యంతో ఉన్న నవనీతను స్థానిక వెంకటేశ్వర క్లినిక్కు తీసుకొచ్చామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే మహిళ మృతి చెందిందని కన్నీటి పర్యంతమయ్యారు.
ఆర్ఎంపీ నిర్లక్ష్యం, మహిళ మృతి
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆలేరు నియోజకవర్గం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనలు ఒకే నెలలో రెండు జరిగాయి. జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణలోపం వల్ల అనుమతులు లేని ప్రైవేట్ ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి:పాఠాల కోసం పాట్లు- పండ్లు అమ్మితేనే స్మార్ట్ఫోన్!