గాంధీ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోన్న ఉమామహేశ్వర్ అనే వ్యక్తి తనపై, తన సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడని మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ ఆరోపించింది. ఈ మేరకు చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది.
గాంధీ ఆస్పత్రిలో దారుణం.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం! - gandhi hospital latest issue
17:08 August 16
గాంధీ ఆస్పత్రిలో దారుణం.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం!
తన బావ చికిత్స నిమిత్తం ఐదు రోజుల క్రితం గాంధీ ఆసుపత్రికి వచ్చినట్లు బాధితురాలు తెలిపింది. ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఉమా మహేశ్వర్ అనే వ్యక్తి మత్తు మందు ఇచ్చి తమపై అత్యాచారానికి పాల్పడి.. తన సోదరిని అపహరించాడని ఆమె ఆరోపించింది. ఇదే విషయమై మహబూబ్‌నగర్‌లో కేసు నమోదు కాగా.. విచారణ కోసం చిలకలగూడకు కేసును బదిలీ చేశారు.
చిలకలగూడ ఇన్స్పెక్టర్ బాధిత మహిళను విచారించారు. కేసు విషయమై విచారణ నిమిత్తం పోలీసులు బాధితురాలి కుటుంబ సభ్యులతో గాంధీ ఆసుపత్రికి వెళ్లారు.
ఇదీ చూడండి: Ramya Murder case : "ఇన్‌స్టా' పరిచయమే ప్రాణం తీసింది.. ప్రజలు అడ్డుకుంటే బతికేదేమో"