woman suicide in mancherial : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్‌లో సిద్ది వీరయ్య, జమున దంపతులు ఇల్లు నిర్మించుకున్నారు. ఇంకా మొదటి అంతస్తు పనులు జరుగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో రాళ్లవాగు సమీపంలోని వీరి ఇల్లు వరద నీటిలో మునిగి అంతా బురదపాలైంది. దీన్ని చూసి జమున(62) కలతచెందింది. తీవ్ర మనస్తాపానికి గురైన జమున బుధవారం తెల్లవారుజామున ఇంటి మొదటి అంతస్తులోని పిల్లరుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
కలల సౌధం కూలి.. మనసు విరిగి.. చివరకు ఆత్మహత్య - మంచిర్యాలలో మహిళ ఆత్మహత్య
woman suicide in mancherial : కష్టపడి సంపాదించిన సొమ్ముకు తోడు కొంత అప్పుచేసి కలల ఇంటిని నిర్మించుకుంది ఆ కుటుంబం. ఈ నెల 1నే గృహప్రవేశం చేశారు. అంతలోనే వరదకు ఇల్లు మునగడంతో బాధను దిగమింగుకోలేక ఆ తల్లి తన ఇంటి ఆవరణలోనే బలవన్మరణానికి పాల్పడింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ విషాద ఘటన జరిగింది.
woman suicide in mancherial
ఆమె భర్త వీరయ్య కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాడ్లో చికిత్స పొందుతున్నారు. అప్పుచేసి కట్టుకున్న ఇల్లు వరదలో మునగడంతో జమున తీవ్రమనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.