Woman Suicide in Bharatnagar : ఎక్కువగా ఫోను మాట్లాడుతోందని అత్త మందలించడంతో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. బోరబండలోని భరత్‌నగర్‌కు చెందిన పవన్‌తో సికింద్రాబాద్ అడిక్మెట్‌కు చెందిన శిల్ప(22)కు మూడు నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత శిల్ప అత్తారింటికి వెళ్లింది. మొదట్లో అంతా బాగానే ఉన్నా.. నెమ్మది నెమ్మదిగా అత్తాకోడళ్ల మధ్య చిన్నచిన్న తగాదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఒక రోజు.. ఎక్కువగా ఫోన్ మాట్లాడుతున్నావని అత్త కోడలిని మందలించింది. ఈ విషయంలో అత్తాకోడళ్ల మధ్య వివాదం చెలరేగింది.
Woman Suicide in Bharatnagar : ఫోన్ ఎక్కువ మాట్లాడుతోందని అత్త మందలింపు.. కోడలి ఆత్మహత్య - భరత్‌నగర్‌లో మహిళ ఆత్మహత్య
Woman Suicide in Bharatnagar : ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది ఆ నవవధువు. ఇన్నాళ్లూ అమ్మానాన్నలతో ఉన్న ఆమెకు.. అత్తింట్లో అంతా కొత్తగా అనిపించింది. నెమ్మది నెమ్మదిగా సర్దుకుపోతున్న తరుణంలో.. ఫోన్ ఎక్కువగా మాట్లాడుతున్నావేంటని అత్త మందలించింది. అప్పటికే పుట్టిల్లుపై బెంగతో ఉన్న ఆ యువతి.. అత్త మందలింపుతో మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Woman Suicide in Bharatnagar
అత్తారింట్లో సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తున్న శిల్పకు అత్త మందలింపు మనస్తాపానికి గురి చేసింది. పుట్టింటిపై బెంగ ఓ వైపు.. అత్త మందలింపు మరోవైపు.. ఆమెను మనోవేదనకు గురి చేశాయి. ఈ క్రమంలో శిల్ప ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శిల్ప గర్భం దాల్చినట్లు సమాచారం.