Constable Harassment : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం తహరాపూర్‌కి చెందిన దొంగరి సంగీత(30) ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఐసీడీఎస్ పర్యవేక్షకురాలిగా పనిచేస్తున్నారు. హనుమకొండ ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సర్వేశ్ యాదవ్ ఆమెకు కొద్ది నెలల కిందట పరిచయమయ్యాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ సంగీతకు అతను తరచూ ఫోన్ చేసి వేధించేవాడు.
పెళ్లి చేసుకోమని కానిస్టేబుల్ వేధింపులు.. ఆ యువతి ఏం చేసిందంటే? - హన్మకొండలో మహిళ ఆత్మహత్య
Woman Suicide : కానిస్టేబుల్ వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం తహరాపూర్‌లో చోటుచేసుకుంది. పురుగుల మందు తాగిన యువతి.. తన సోదరికి ఆ విషయం చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసిన ఆమె సోదరి బాధితురాలిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.
Woman Suicide
ఈ క్రమంలో సోమవారం రోజువారీ విధులు ముగించుకుని ఇంటికొచ్చిన సంగీత పురుగు మందు తాగి.. తన సోదరికి తెలియజేశారు. వెంటనే పరకాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మృతురాలి తండ్రి వీరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వీరభద్రరావు తెలిపారు.
ఇవీ చదవండి :