తెలంగాణ

telangana

ETV Bharat / crime

Woman Suicide in Nirmal : ఉద్యోగం రాలేదని వివాహిత ఆత్మహత్య - నిర్మల్​లో మహిళ ఆత్మహత్య

Woman Suicide in Nirmal : ఉన్నత చదువులు చదివినా కొలువు రాలేదు. ఇంతలోనే వివాహమైంది. పెళ్లైనా.. స్వశక్తితో జీవించాలనుకుంది. ఉద్యోగవేటలో పడింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాసింది. విజయం సాధించలేకపోయానని మనోవేదనకు గురైంది. చివరకు చావే శరణమనుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

Woman Suicide in Nirmal
Woman Suicide in Nirmal

By

Published : Feb 5, 2022, 9:54 AM IST

Woman Suicide in Nirmal : ఉద్యోగం రాలేదని మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. శాంతినగర్​ కాలనీకి చెందిన శ్రీలత(30)కు పదేళ్ల క్రితం సంతోశ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. భర్త స్థానికంగా ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నాడు. శ్రీలత ఎమ్మెస్సీ బీఎడ్ పూర్తి చేసింది. బ్యాంకింగ్, గురుకులాల్లో ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాస్తోంది. ఎన్నిసార్లు రాసినా.. విజయం సాధించలేకపోయానని తీవ్ర మనోవేదనకు గురైంది.

Woman Commits Suicide in Nirmal : ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి శుక్రవారం రోజున.. ఉరి వేసుకుని బలవన్మరణానికి యత్నించింది. అప్పుడే ఇంటికొచ్చిన కుటుంబ సభ్యులు గమనించి ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్రీలత మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details