మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పావని(28)కి నిర్మల్ జిల్లా సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్‌కు చెందిన సిద్దురాములుకు 2014లో వివాహమైంది. వీరికి ఆరేళ్లబాబు, మూడు సంవత్సరాల కూతురు ఉన్నారు. సంవత్సరం క్రితం అత్తతో పావనికి చిన్న గొడవ కావడంతో పుట్టింటికి వెళ్లింది. తర్వాత భర్త రాములు వెళ్లి ఇంటికి తీసుకొచ్చాడు.
భర్తపై అలిగి కుమార్తెతో సహా ఎస్సారెస్పీలో దూకిన మహిళ - nirmal district crime news
బంధువు వివాహానికి తీసుకువెళ్లలేదని భర్తపై అలిగిన ఓ మహిళ కుమార్తెతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్లో చోటుచేసుకుంది.
మహిళ ఆత్మహత్య, నిర్మల్లో మహిళ ఆత్మహత్య, నిర్మల్ వార్తలు
మంగళవారం ఉదయం కుటుంబ సభ్యుల వివాహ వేడుకకు తీసుకెళ్లలేదని భర్తపై అలిగిన పావని కొడుకును ఇంటి వద్దే ఉంచి కుమార్తెను తీసుకొని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. భర్త ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పావని, ఆమె కుమార్తె మృతదేహాలను గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భర్త, అత్త కలిసి పావనిని, పాపని చంపి ఎస్సారెస్పీలో పడేసి ఉంటారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.