Suicide attempt: రహమత్‌నగర్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే? - తెలంగాణ వార్తలు
11:41 October 26
రహమత్‌నగర్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ రహమత్‌నగర్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం(Suicide attempt) ఘటన కలకలం రేపింది. అనుమతులు లేకుండా ఇల్లు నిర్మించారంటూ జీహెచ్ఎంసీ(GHMC Officers news) అధికారులు కూల్చివేసేందుకు సిద్దమయ్యారు. అధికారులతో ఇంటి యజమానులు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు(Suicide attempt) యత్నించారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను అడ్డుకుని కాపాడారు. ఇంటి కూల్చివేతకు వారు సహకరించకపోవడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
ఇదీ చదవండి:DH Srinivas Rao: 'టీకా తీసుకోనివారికి నవంబర్ 1 నుంచి రేషన్, పింఛన్ బంద్'