కుటుంబ కలహాల కారణంగా ఓ వృద్ధురాలు చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో జరిగింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.
Suicide: కుటుంబ కలహాలతో వృద్ధురాలు ఆత్మహత్య - ఆత్మహత్యలు కారణాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో జీవితం మీద విరక్తి చెందిన ఓ వృద్ధురాలు.. ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
వృద్ధురాలు ఆత్మహత్య
స్థానికురాలు లక్ష్మికి(74) భర్త చనిపోయిన నాటి నుంచి మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు తెలిపారు. తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేదని తెలిపారు. నేడు కూడా.. మాటా మాట పెరగడంతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని అన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:Monitor lizard: ఉడుమును వేటాడారు.. జైలుకెళ్లారు..