Woman caught thief after chasing in Ghatkesar : పట్టపగలు బ్యాంకులో ఓ యువకుడు మహిళ చేతిలో ఉన్న డబ్బును లాక్కొని పారిపోయాడు. వెంటనే స్పందించిన ఆమె వెంటాడి పట్టుకుని పోలీసులకు అప్పగించింది. ఈ ఉదంతం ఘట్‌కేసర్ ఠాణా పరిధిలో జరిగింది. దొంగను పట్టుకున్న మహిళను పోలీసులు అభినందించారు. మరోవైపు దొంగను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Crime News: ఉగ్ర నర్సమ్మ.. దొంగను వెంటాడి పట్టుకున్న మహిళ
Woman caught thief after chasing in Ghatkesar: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లో బ్యాంకులో ఓ యువకుడు మహిళ చేతిలో ఉన్న డబ్బును లాక్కొని పారిపోయాడు. వెంటనే స్పందించిన ఆమె గట్టిగా కేకలు వేస్తూ.. పారిపోతున్న దొంగను వెంటాడి మరీ పట్టుకుంది. స్థానికులకు జరిగిన విషయం చెప్పడంతో యువకుడికి దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
పోలీసులు, బాధితురాలి వివరాల ప్రకారం.. ఎదులాబాద్‌కు చెందిన నర్సమ్మ పొదుపు సంఘం నాయకురాలిగా వ్యవహరిస్తోంది. రోజు వారీగా సంఘంలో జమ అయ్యే సభ్యులకు చెందిన రూ.50వేలు గురువారం ఘట్‌కేసర్ పట్టణంలోని యూనియన్ బ్యాంకులో జమ చేసేందుకు వచ్చింది. ఆమెను గమనిస్తూ ఉన్న యువకుడు చేతిలో ఉన్న నగదు తీసుకొని పారిపోయాడు. నర్సమ్మ గట్టిగా కేకలు వేస్తూ పారిపోతున్న దొంగను సుమారు అర కిలోమీటరు వరకు వెంటాడి పట్టుకుంది. జరిగిన విషయం చెప్పడంతో స్థానికులు యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నర్సమ్మను పలువురు అభినందించారు. దొంగ అదుపులో ఉన్నారని, ప్రశ్నిస్తున్నామని క్రైమ్ విభాగం సీఐ జంగయ్య పేర్కొన్నారు.
ఇవీ చదవండి: