ఏపీలోని కడపలో వివాహేతర సంబంధం ఓ హత్యకు దారితీసింది. నగరానికి చెందిన జయశంకర్, యశోదలకు పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి సంసార జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. కొద్ది రోజుల నుంచి యశోద కడప మాసాపేటకు చెందికు నిత్య పూజయ, అలియాస్ సురేష్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
Murder: వివాహేతర సంబంధం.. మహిళ దారుణ హత్య - kadapa district latest updates
వివాహేతర సంబంధం ఓ హత్యకు దారితీసింది. ఈ ఘటన ఏపీలోని కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
హత్య
ఈ మేరకు యశోద కొద్దిరోజుల కిందట భర్తను ఇద్దరు పిల్లలను వదిలేసి సురేష్ వద్దకు వెళ్లింది. అతని వద్దనే ఉంటోంది. ఇవాళ యశోద... సురేష్తో తనను పెళ్లి చేసుకోమని అడుగగా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన సురేష్... యశోద ముఖంపై దిండు పెట్టి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:rape attempt: తాతయ్యలే కదా అని వెళ్తే.. దారుణానికి ఒడిగట్టారు..!