Woman Attack on Police with Beer Bottle: ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో వైఎంసీఏ వద్ద మద్యం గంజాయి మత్తులో అమూల్య అనే యువతి హల్చల్ చేసింది. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ.. గంజాయితో కూడిన సిగరెట్ కాల్చుతున్న యువతిని.. విధుల్లో ఉన్న త్రీటౌన్ ఏఎస్ఐ పీవీవీ సత్యనారాయణ వారించారు. దీంతో ఆమె తమపై బీరు బాటిల్ విసిరేసి.. కాలుతో తన్నినట్లు పోలీసులు తెలిపారు. అంతటితో ఆగకుండా అసభ్యకర పదజాలంతో దూషించిందన్నారు.
మద్యం మత్తులో యువతి హల్చల్.. పోలీసులపై దాడి - Woman attack on Police
Woman attack on Police: ఏపీలోని విశాఖపట్నంలో ఓ యువతి హల్చల్ చేసింది.. బీచ్‌లో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులపై దాడికి పాల్పడింది. బీర్ సీసా విసిరేయడంతో, పోలీసుల పక్కనే ఉన్న ఓ వ్యక్తికి తగిలి గాయమైంది. ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Woman attack on Police
యువతి మద్యం సీసా విసరడం వల్ల గోవింద్ అనే యువకుడికి గాయమైనట్లు వెల్లడించారు. మహిళా పోలీస్ సహకారంతో అమూల్యను మూడో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసులను దూషించి, గాయపరచడంతో పాటు.. మద్యం సీసాతో ఇతరులను గాయపరిచినందుకు ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఉన్నత చదువులు చదివి గంజాయికి బానిస కావడం.. స్థానికులను విస్మయానికి గురి చేస్తోంది.
ఇవీ చదవండి: