baby died: హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకంతో ఓ శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మరణించాడని బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంతోనే తమ బిడ్డ చనిపోయినట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆసుపత్రికి చెందిన డాక్టర్ కూతురు వివాహం వచ్చే నెలలో ఉండటంతో.. స్నేహితులకు ముందస్తుగా ఆసుపత్రిలోనే విందు ఏర్పాటు చేశాడు.
గర్భిణిని పట్టించుకోకుండా వైద్యుల పార్టీ.. గర్భంలోనే శిశువు మృతి - హైదరాబాద్ తాజా నేర వార్తలు
baby died: వైద్యుల నిర్లక్ష్యం.. ఈ లోకాన్ని చూడాల్సిన ఆ పసికందుకు శాపమైంది. కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన ఆ తల్లికి కడుపు కోత మిగిల్చింది. తండ్రికి కన్నీరు మిగిల్చింది. ఈ విషాద ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.
ఈ క్రమంలో భవనంపై డీజే ఏర్పాటు చేసి ఆటపాటలతో వేడుకలు జరుపుకుంటున్నారు. అదే సమయంలో నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని కాన్పు కోసం ఆసుపత్రిలో చేర్పించారు. సమయానికి వైద్యం అందకపోవడం.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మరణించాడని బంధువులు ఆరోపించారు. వేడుకల్లో మునిగితేలుతున్న డాక్టర్లు, సిబ్బంది బాధిత మహిళను పట్టించుకోలేదన్నారు. అందుకే తమ బిడ్డ చనిపోయినట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వైద్యుల తీరుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.