కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో అడివి పందులు స్వైర విహారం చేశాయి. దారి తప్పి గ్రామంలో ప్రవేశించి ఎదురొచ్చిన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి.. ఓ వ్యక్తిపై దాడి చేశాయి.
అడవి పందుల స్వైర విహారం.. ఒకరికి గాయాలు - kamareddy updates
అడవి పంది దాడిలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలో చోటు చేసుకుంది.
అడవి పందుల స్వైర విహారం.. ఒకరికి గాయాలు
ఈ ఘటనలో మల్కాపూర్ గ్రామానికి చెందిన అంజయ్య కాలును గాయపరిచి పాఠశాలలోకి పరుగులు తీశాయి. ఆ సమయంలో విద్యార్థులు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. నిజాంసాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండడంతో అడవిపందులు గ్రామాల్లో సంచరిస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.