short circuit at flyover in vijayawada : ఏపీలోని విజయవాడలోని దుర్గగుడి వెళ్లే మార్గంలో ఉన్న ఫ్లైఓవర్ కింద ఒక్కసారిగా మంటలు వచ్చాయి. రైల్వే సిబ్బంది, అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. వైఫై కేబుల్ వైర్లు లాగే క్రమంలో.. రైలు నడిచే విద్యుత్ తీగలు తగిలి ఈ వైర్ల నుంచి మంటలు వచ్చినట్లు తెలిపారు.
దుర్గగుడికి వెళ్లే మార్గంలో ఫ్లైఓవర్‌పై అగ్నిప్రమాదం - విజయవాడ తాజా వార్తలు
short circuit at flyover in vijayawada : విజయవాడలోని దుర్గగుడి వెళ్లే మార్గంలో ఉన్న ఫ్లైఓవర్ కింద ఒక్కసారిగా మంటలు వచ్చాయి. రైల్వే సిబ్బంది, అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. వైఫై కేబుల్ వైర్లు లాగే క్రమంలో.. రైలు నడిచే విద్యుత్ తీగలు తగిలి ఈ వైర్ల నుంచి మంటలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
![దుర్గగుడికి వెళ్లే మార్గంలో ఫ్లైఓవర్‌పై అగ్నిప్రమాదం short circuit at flyover in vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15634515-136-15634515-1655962355005.jpg)
short circuit at flyover in vijayawada
మంటలు వచ్చినప్పుడు భయాందోళనలతో వైర్లు లాగే సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మంటల వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే తెలిపారు. జాగ్రత్తలు తీసుకోకుండా వైఫై కేబుల్ వైర్లు లాగిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు వెల్లడించారు. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు మంటలను చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడూ వీఐపీలు తిరిగే మార్గంలో మంటలు రావటంతో.. కొద్దిసేపు ఏం జరుగుతుందో ప్రజలకు అర్ధంకాలేదు.
దుర్గగుడికి వెళ్లే మార్గంలోని ఫ్లైఓవర్‌పై అగ్నిప్రమాదం