తెలంగాణ

telangana

ETV Bharat / crime

పిల్లలున్నా.. ప్రియుడే కావాలంది.. మొగుడిని కడతేర్చింది! - భర్తను చంపిన భార్య

Wife murdered husband: పెళ్లై పిల్లలున్నా.. ప్రియునితోనే కలిసుండాలనే ఆమె కోరిక కట్టుకున్నవాడినే కడతేర్చేలా చేసింది. ప్రియుడితో కలిసి.. తన భర్తను ఓ ఇల్లాలు అంతమొందించిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగింది.

wife murdered husband: పిల్లలున్నా.. ప్రియుడే కావాలంది.. మొగుడిని కడతేర్చింది!
wife murdered husband: పిల్లలున్నా.. ప్రియుడే కావాలంది.. మొగుడిని కడతేర్చింది!

By

Published : Jan 13, 2022, 2:52 PM IST

Wife murdered husband: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి ఆపై మృతదేహాన్ని కాలువలో పడేసిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగింది. తాడేపల్లి మండలం సీతానగరానికి చెందిన జలపత్రి నాగరాజుకు.. బిట్రగుంట ప్రాంతానికి చెందిన సోనీలకు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఆరేళ్లుగా పొన్నూరులో నివాసముంటున్నారు. సోనీ ప్రవర్తనపై అనుమానం రావడంతో కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య వివాదం నడుస్తోంది.

ఈ క్రమంలోనే.. ఈనెల 7న భార్య సోనీ ఆమె ప్రియుడు సహా మరి కొంతమంది కలిసి నాగరాజును ఇంట్లోనే హతమార్చారు. అదేరోజు రాత్రి నాగరాజు మృతదేహాన్ని బాపట్ల కాలువలో పడేశారు. 9వ తేదీన నాగరాజు తోడల్లుడు.. మృతుని మేనల్లుడికి ఫోన్ చేసి జరిగిందంతా తెలిపాడు.

నాగరాజు మేనల్లుడు ఏడుకొండలు.. ఇంటికి వచ్చి పరిశీలించగా ఇంట్లో రక్తం మరకలు కనబడ్డాయి. సోనీపై అనుమానం వచ్చి ఏడుకొండలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పొన్నూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని.. సోనీని, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. బుధవారం బాపట్ల కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు కనుగొన్నారు. ఆ మృతదేహం నాగరాజుదేనని గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details