ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలోని పరశురాంపురం గ్రామానికి చెందిన మజ్జి సోమేశ్వరరావు(45), భార్య సునీత(35) తొమ్మిదేళ్ల కిందట హైదరాబాద్ నగర శివారు శ్రీకృష్ణానగర్‌కు వచ్చి ఉంటున్నారు. వీరికి కూతురు(16), కుమారుడు(14) ఉన్నారు. స్థానికంగా టెంట్‌హౌస్ దుకాణం నిర్వహిస్తూ అప్పులపాలయ్యారు. సోమేశ్వరరావు తాగుడుకు బానిసయ్యాడు. అప్పుల బాధతో తాను ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో బెదిరిస్తుండేవాడు.
భర్తను హతమార్చి... సహజ మరణంగా నమ్మించి! - భర్తను హతమార్చి... సహజ మరణంగా నమ్మించి...
తాగుడుకు బానిసైన భర్తను కుమారుడి సాయంతో హతమార్చింది. అది సహజమరణంగా చిత్రీకరించి అందరినీ ఏమార్చింది. ఈ సంఘటన హైదరాబాద్ పేట్‌బషీరాబాద్ ఠాణా పరిధిలో జరిగింది.
భర్త వేధింపులు తట్టుకోలేని సునీత... సోమేశ్వరరావును హత్య చేయాలని పథకం వేసింది. ఫిబ్రవరి 27న రాత్రి సోమేశ్వర్‌రావు నిద్రించిన అనంతరం ముక్కు ద్వారా శ్వాస రాకుండా చేసి హత్య చేసింది. భర్తను హత్య చేయటానికి కుమారుని (14) సాయం తీసుకుంది. పెనుగులాటలో గొంతుపై కమిలిన నల్లని గాయమైంది. 28న ఉదయం భర్త నిద్ర లేవటం లేదని భర్త సోదరుణ్ని నమ్మించి ఠాణాలో సహజ మరణంగా ఫిర్యాదు చేయించింది. తల్లి, కుమారుడిని పోలీసులు వేర్వేరుగా విచారించగా విషయం బయటపడింది. హత్య కేసుగా నమోదు చేసి నిందితులిద్దరినీ రిమాండ్‌కు పంపారు.
ఇదీ చూడండి:రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్ల మార్కు చేరే అవకాశం
TAGGED:
పేట్‌బషీరాబాద్ వార్తలు