హైదరాబాద్ రాయదుర్గం పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు కసాయి భర్త. స్థానిక అంజయ్యనగర్‌లో నివాసముండే కిరోసిన్ డీలర్ మోసిన్ ఖాన్ ఐదు నెలల క్రితం ఫర్హానా ఖురేషి(35)ని ప్రేమవివాహం చేసుకున్నాడు. మహరాష్ట్రకు చెందిన ఆమె ఇదివరకే ఇద్దరిని వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. ఆమెకు ముగ్గురు సంతానం ఉన్నారు. కర్ణాటకకు చెందిన మోసిన్ఖాన్తో ఫర్హానాకు పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు ప్రేమపెళ్లి చేసుకున్నారు.
భార్యపై అనుమానం.. గొంతు కోసి హత్య - భార్యను దారుణంగా హత్యచేసిన భర్త
అనుమానమే ఆమె పాలిట శాపమైంది. వందేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. ఈ పాశవిక ఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం పీఎస్ పరిధిలోని అంజయ్యనగర్‌లో జరిగింది.
భార్యను హత్యచేసిన కసాయి భర్త
వివాహం తర్వాత ఆమెపై అనుమానం పెంచుకున్నాడు మోసిన్‌ఖాన్. దీంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. నిన్న రాత్రి మాటామాట పెరిగి భార్యపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావమైన మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మోసిన్ఖాన్ను అదుపులోకి తీసుకున్నట్లు రాయదుర్గం సీఐ రవీందర్ వెల్లడించారు. పోస్టుమార్టం కోసం మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.