తెలంగాణ

telangana

By

Published : Aug 22, 2022, 3:05 PM IST

ETV Bharat / crime

హత్యకేసులో హంతకులను పట్టించిన సెల్​ఫోన్​ 59రోజుల తర్వాత వెలుగులోకి

PUBLIC PROSECUTOR MURDER కట్టుకున్న భార్యే భర్తను కడతేర్చింది. ఆ హత్యను సహజ మరణంగా చిత్రీకరించింది. కానీ నిజం ఎప్పటికీ బయటపడదనుకుంది. మృతుని తండ్రి ఫిర్యాదుతో అసలు నిజం బయటపడి, చివరికి కటకటాల పాలయ్యింది.

PUBLIC PROSECUTOR MURDER
పబ్లిక్ ప్రాసిక్యూటర్ హత్య

MURDER UPDATE కట్టుకున్న భార్యే భర్తను కడతేర్చి, సహజ మరణంగా చిత్రీకరించింది. కుటుంబసభ్యులు, బంధువులు అదే నిజమని నమ్మారు. తాము బయటపడ్డామని నిందితులు ఊపిరి పీల్చుకున్నారు. సెల్‌ఫోన్‌లోని సమాచారంతో మృతుడి తండ్రికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించగా, విచారణలో గుట్టు బయటపడింది. ఏపీలోని కాకినాడ ప్రత్యేక పోక్సో కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మహ్మద్‌ అక్బర్‌ ఆజాం ఈ ఏడాది జూన్‌ 23న మరణించారు. హత్య అనే అంచనాలతో 59 రోజుల తర్వాత శవపరీక్ష చేశారు.

ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడ నగరానికి చెందిన పీపీ అక్బర్‌ ఆజాం (50) మొదటి భార్య 15 ఏళ్ల కిందట ఆడబిడ్డకు జన్మనిచ్చి మరణించింది. తర్వాత యానాంకు చెందిన అహ్మదున్నీషా బేగం (36)ను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు జన్మించారు. ఆజాం తల్లిదండ్రులు కాకినాడలో ఉంటున్నారు. గతంలో ఆయన తన భార్యకు కొత్త ఫోన్‌ కొని ఇచ్చి.. అప్పటిదాకా ఆమె వాడిన పాత ఫోన్‌ను తన తండ్రి హుస్సేన్‌కు ఇచ్చారు. కుమారుడి మరణానంతరం ఇటీవల హుస్సేన్‌ ఆ ఫోన్‌లోని పాత వాట్సప్‌ ఛాటింగ్స్‌, వాయిస్‌ మెసేజ్‌లను గమనించారు. అందులో ఆజాం నివాసముండే అపార్ట్‌మెంట్‌లో పై ఫ్లాట్‌లో ఉంటున్న రాజస్థాన్‌కు చెందిన రాజేష్‌ జైన్‌తో పాటు మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ కిరణ్‌తో కోడలు అహ్మదున్నీసా జరిపిన సంభాషణలు వెలుగుచూశాయి. వాటి ఆధారంగా తన కొడుకుది హత్యేమోనని అనుమానించిన హుస్సేన్‌ ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

క్లోరోఫాంతో మత్తిచ్చి:పోలీసుల విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. జూన్‌ 23న అహ్మదున్నీషా తన భర్తకు ముందుగా నిద్రమాత్రలు ఇచ్చింది. గాఢ నిద్రలోకి వెళ్లగా మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ కిరణ్‌ తన వెంట తెచ్చిన క్లోరోఫాంను ఓ గుడ్డలో వేసి దాన్ని ఆజాం ముక్కు వద్ద గట్టిగా అదిమిపెట్టాడు. ఇందుకు ఆజాం భార్య సహకరించింది. ఆ సమయంలో రాజేష్‌ జైన్‌ ఇంటి బయట కాపలాగా ఉన్నాడు. మత్తు మోతాదు ఎక్కువ కావడంతో ఆజాం మరణించారని పోలీసుల విచారణలో తేలింది. తనకు సన్నిహితంగా మెలిగిన యువకుల సహాయంతో భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించి హత్యకేసుగా నమోదు చేశారు. శనివారం జీజీహెచ్‌ ఫోరెన్సిక్‌ వైద్యుల బృందం శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించింది. అహ్మదున్నీషా, కిరణ్‌, రాజేష్‌ జైన్‌లను నిందితులుగా పేర్కొన్న పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సమాచారం అందింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details