Wife Killed Husband: మద్యం మత్తులో వేధిస్తున్నాడని నిద్రిస్తున్న భర్తపై కత్తితో భార్య హత్య చేసింది.. రక్తపు మడుగులో కొట్టుకొని ప్రాణాలు విడిచిన భర్త పక్కనే నిద్రించింది.. ఉదయం ఎప్పటిలా ఇంటి పనులు చేసిన ఆమె.. 8 గంటలకు భర్త ఉరేసుకొని చనిపోయాడని విలపిస్తున్నట్లు నటించింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది.
శంషాబాద్ ఇన్‌స్పెక్టర్ ఎ.శ్రీధర్‌కుమార్ తెలిపిన కథనం ప్రకారం.. నానాజీపూర్‌కు చెందిన ఒల్కే రాజు(40), జ్యోతి దంపతులు. వీరికి పదేళ్ల లోపు కుమారుడు, కూతురు ఉన్నారు. దినసరి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా రాజు మద్యానికి బానిసయ్యాడు. పనులకు వెళ్లకుండా జులాయిగా తిరగడమే కాకుండా భార్య ప్రవర్తనను అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలో నిత్యం గొడవ పడేవారు.