తెలంగాణ

telangana

ETV Bharat / crime

భర్తను రోకలిబండతో కొట్టి చంపి.. ప్రియుడితో కలిసి..! - భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య

Wife Killed Husband: వివాహేతర సంబంధాలు.. దాంపత్య బంధాన్ని కడతేర్చుతున్నాయి. ఆ మోజులో పడి కట్టుకున్న వాడిని.. కడుపున పుట్టిన వాళ్లను సైతం వదిలేసేందుకు సైతం సిద్ధమవుతున్నారు. అడ్డొస్తే చంపడానికి సైతం వెనకాడటం లేదు. ఆ తర్వాత జరిగే పరిణామాలు తెలిసినా.. క్షణిక సుఖాల కోసం కుటుంబాలను వీధిపాలు చేస్తున్నారు. ప్రియుడితో ఊహల్లో తేలుతున్న భార్యకు తప్పని చెప్పి నచ్చజెప్పిన భర్తనే పొట్టనపెట్టుకుంది ఆ ఇల్లాలు. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం వద్దన్నందుకు వినక పోగా.. భర్తను రోకలిబండతో కొట్టి చంపేసింది భార్య. ఈ దారుణం కరీంనగర్​ జిల్లాలో జరిగింది.

భర్తను రోకలిబండతో కొట్టి చంపి.. ప్రియుడితో కలిసి..!
భర్తను రోకలిబండతో కొట్టి చంపి.. ప్రియుడితో కలిసి..!

By

Published : May 30, 2022, 4:51 PM IST

Wife Killed Husband: జీవిత భాగస్వామిపై అనుమానాలు, వివాహేతర సంబంధాలు.. దంపతుల మధ్య బంధాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. మూడు ముళ్ల బంధానికి కట్టుబడలేక.. అడ్డదారులు తొక్కుతూ.. ఆ తర్వాత తప్పులు చేస్తూ.. తమ జీవితాలనే కాకుండా పక్కవారి జీవితాలను సైతం అంధకారం చేస్తున్నారు. వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయనడానికి ఈ దారుణ ఘటనే ఓ ఉదాహరణ.

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని అతని భార్య పెనుగొండ లక్ష్మీ రోకలి బండతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా వెంకటేశ్వరరావు పెళ్లిళ్లు పేరంటాలకు వంటలు చేస్తుండేవాడు. లక్ష్మి మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంపై భార్యాభర్తలు తరచూ గొడవపడే వారు. వివాహేతర సంబంధం విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగగా.. ఈ క్రమంలో తమకు అడ్డుగా ఉన్న వెంకట్​రెడ్డిని అంతం చేయాలని నిర్ణయించుకుంది. ఇంకేముంది రోకలిబండతో అతడిని కొట్టి చంపింది. . అతని మృతదేహాన్ని ప్రియుడు వెంకటస్వామి సాయంతో హుస్నాబాద్‌ పొట్లపల్లి వాగులో పూడ్చిపెట్టింది. నిందితులతో మరో వ్యక్తి భయపడి పోలీసులకు విషయాన్ని తెలియజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వరరావును భార్య లక్ష్మి రెండు రోజుల క్రితం శుక్రవారం రాత్రి రోకలిబండతో కొట్టి చంపిందని, మరో వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉండడమే హత్యకు కారణమని తెలిపారు. అదే రాత్రి ప్రియుడు వెంకటస్వామితో కలిసి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి వాగులో మృతదేహాన్ని తీసుకువచ్చి పూడ్చివేసినట్లు నిందితులతో ఉన్న మరో వ్యక్తి కుమార్ గన్నేరువరం పోలీస్ స్టేషన్​లో నేరాన్ని అంగీకరించి లొంగిపోయినట్లు తెలిపారు. నిందితుడు తెలిపిన సమాచారం మేరకు నిందితురాలు భార్య లక్ష్మి, ప్రియుడు వెంకటస్వామిని అదుపులోకి తీసుకొని నేడు పొట్లపల్లి వాగులో మృతదేహాన్ని వెలికి తీశామని వెల్లడించారు. మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, పూర్తి వివరాలు దర్యాప్తు చేసిన అనంతరం వెల్లడిస్తామన్నారు.

"ఈనెల 27వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో హత్య జరిగిందని.. మృతుని భార్య, ఆమె ప్రియుడు కలిసి ఆ మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా పొట్లపల్లిలో పాతిపెట్టారని సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది. వారికి కుమార్‌ అనే వ్యక్తి సాయం చేశాడు. భయానికి లోనైన కుమార్‌.... విషయాన్ని గన్నేరువరం పోలీస్​స్టేషన్​కు వచ్చి చెప్పాడు. దర్యాప్తులో భాగంగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. హత్యచేసిన మృతదేహాన్ని పొట్లపల్లిలో పాతిపెట్టినట్లుగా నేరాన్ని ఒప్పుకున్నారు. మరో వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉండడమే హత్యకు కారణమని తెలిసింది." -కృష్ణారెడ్డి, మానకొండూరు సీఐ

హత్య వివరాలు వెల్లడించిన పోలీసులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details