ఏపీలోని విజయనగరం జిల్లా లంకవీధిలో దారుణం జరిగింది. భర్తను కత్తితో పొడిచి హత్య చేసింది భార్య. భర్త శ్రీనివాసరావు నిత్యం మద్యం తాగి వచ్చి కొడుతున్నాడని భార్య రెవల్ల గౌరి ఈ ఘాతుకానికి పాల్పడింది. లంకవీధి నానజాతిపేటకు చెందిన రెవల్ల శ్రీనివాసరావు(42) మద్యానికి బానిసై భార్యను హింసిస్తున్నాడని రెండవ పట్టణ సీఐ లక్ష్మణరావు తెలిపారు.
WIFE KILLED HUSBAND: చాకుతో పొడిచి భర్తను హత్య చేసిన భార్య - latest crime news
కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ భార్య. ఈ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

హత్యా
ఈరోజు మధ్యాహ్నం భార్య గౌరీ వంట చేస్తుండగా.. భర్త మద్యం సేవించి ఇంటికి వచ్చి.. గొడవ చేశాడు. విసుగుచెందిన భార్య.. భర్తను కూరగాయలు కోసే చాకుతో పొడిచి హత్య చేసింది. ఘటనపై కేసు నమోదు చేసి.. పోలీసులు విచారిస్తున్నారు.
WIFE KILLED HUSBAND: మద్యం తాగి వేధిస్తున్నాడని.. భర్తను చంపిన భార్య
ఇదీ చదవండి:Kilady Ladies: టైలరింగ్ వృత్తి... దొంగతనాలు ప్రవృత్తి