తెలంగాణ

telangana

ETV Bharat / crime

భర్తను చంపి.. సాధారణ మరణంగా సృష్టించబోయి.... - ap crime news

వివాహేతర సంబంధం కారణంగా.. ఓ వివాహిత కట్టుకున్న భర్తను ఉరేసి చంపేసింది. గుండెపోటుతో మరణించాడని బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది. ఆమెపై అనుమానమొచ్చి ఆమె కుమారుడు పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. ఆమె భర్త అంత్యక్రియలు జరుగుతుండగానే పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా అరిగిలవారిపల్లిలో జరిగింది.

wife killed her husband
wife killed her husband

By

Published : Jul 30, 2021, 7:23 PM IST

ఓ వైపు భర్త అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈలోగా అక్కడకు చేరుకున్న పోలీసులు భార్యను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. తీరా విషయం తెలిసిన తర్వాత... ఆమె ఇంత ఘోరం చేసిందా అని అవాక్కయ్యారు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా అరిగిలవారిపల్లిలో జరిగింది.

పనపాకం పంచాయతీ అరిగిలవారిపల్లికి చెందిన వాసు (46) చిత్తూరు కలెక్టర్‌ కార్యాలయంలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తూ... శ్రీనగర్‌ కాలనీలో భార్య స్వప్నప్రియ, కుమారుడు వినయ్‌తో కలిసి ఉంటున్నాడు. చిత్తూరుకు చెందిన ఓ యువకునితో స్వప్నప్రియ చనువుగా ఉండటాన్ని గుర్తించిన ఆమె భర్త వాసు పలుమార్లు మందలించాడు. ఈనెల 19న దంపతులిద్దరు మరోసారి గొడవ పడ్డారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వాసును.. స్వప్నప్రియ కిందపడేసి గొంతుకు ఉరేసి చంపింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు తన భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు అత్త తరఫు బంధువులకు ఫోన్​చేసి చెప్పింది.

ఎవ్వరికీ అనుమానం రాకుండా గొంతు భాగంలో గాయాలను కప్పిపెట్టి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చింది. తన తల్లిపై అనుమానంతో కుమారుడు వినయ్‌... తండ్రి మృతదేహాన్ని నిశితంగా గమనించగా.. గొంతుపై గాయాలు కనిపించాయి. దీంతో మృతుని తల్లి వసంతమ్మతో కలిసి చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన చంద్రగిరి పోలీసులు.. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందినట్లు కేసు నమోదు చేసి చిత్తూరు రెండో పట్టణ పోలీసులకు బదలాయించారు. దీనిపై విచారణ చేపట్టిన చిత్తూరు పోలీసులు హత్యగా నిర్ధరించుకుని గురువారం అరిగిలవారిపల్లిలో మృతుని ఇంట కర్మక్రియలు జరుగుతుండగా స్వప్నప్రియను అదుపులోకి తీసుకున్నారు. తండ్రి మరణించటం, కన్నతల్లి కటకటాల పాలవటంతో బాలుడు వినయ్‌ తన తండ్రి ఫోటో ముందు బోరున విలపించటం చూపరులతో కంటతడి పెట్టించింది.

ఇదీ చూడండి:couple suicide: మా చావుకు ఆ ముగ్గురే కారణం.. దంపతుల సూసైడ్ నోట్

ABOUT THE AUTHOR

...view details