Wife killed her husband: భార్య వివాహేతర సంబంధం తెలిసిన భర్త.. ఆమెను గెంటేయలేదు. పిల్లలను అనాథలు చేయెద్దనే ఉద్దేశంతో ఆమెను మార్చుకోవాలని చూశాడు. పలురకాలుగా నచ్చజెప్పాడు. పిల్లలు ఎదుగుతున్నారని.. ప్రియుడితో తిరగడం ఆపాలని పదేపదే చెప్పి చూశాడు. అయినా ఆమె తీరు మార్చుకోలేదు సరికదా.. ప్రియుడి మోజులో పడి భర్తతో వైరం పెంచుకుంది. చివరికి కట్టుకున్న భర్తనే చంపించింది. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించింది. మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేయగా.. అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీశారు. హత్యగా నిర్ధరించి నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఈ దారుణం వెలుగుచూసింది.
మెరకముడిదాం గ్రామానికి చెందిన అట్టాడ చంద్రశేఖర్ మిమ్స్‌లో క్లర్కుగా పని చేస్తున్నారు. ఆయనకు 16 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని వెంకటాపురానికి చెందిన అరుణ జ్యోతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. వీరంతా నెల్లిమర్ల మండలంలోని గొల్లవీధికి చెందిన కె.రాంబాబు ఇంట్లో అద్దెకు ఉన్నారు. ఆ సమయంలో రాంబాబు, అరుణ జ్యోతి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత చంద్రశేఖర్ భార్యతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. అనంతరం తరచూ రాంబాబు ఇంటికి రావడాన్ని గమనించిన చంద్రశేఖర్ ఆమెతో గొడవకు దిగాడు. దీంతో ప్రియుడి వద్దకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఆమె.. శ్రీకాకుళంలో ఉన్న తల్లి సత్యవతి సహకారం కోరింది. ఆమె రూ.20 వేలు ఇవ్వగా, ప్రియుడు మరో రూ.20 వేలు సమకూర్చాడు. ఈ సొమ్ము తీసుకొని తన భర్తను చంపాలని నెల్లిమర్ల మండలంలోని ఎర్రంశెట్టి సతీష్‌ను పురమాయించింది.