constable extramarital affair: ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్‌ను అతని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని దేహశుద్ధి చేసింది. ఈ ఘటన నల్గొండ పట్టణం ఎన్జీఓ కాలనీలో జరిగింది.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌కు చెందిన ప్రసాద్, శాంతిలకు 2001లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. 2015లో హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించే సమయంలో అక్కడ ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.