తెలంగాణ

telangana

ETV Bharat / crime

భర్తను కడతేర్చిన భార్య.. భూ వివాదమే కారణమా..? - భర్తను హత్య చేసిన భార్య

కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. కటుకున్న భర్తను ఆమె తమ్ముళ్ల సహాయంతో కిరాతకంగా హతమార్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.

wife killed  husband
భర్తను కడతేర్చిన భార్య

By

Published : Jun 7, 2021, 8:41 PM IST

ఓ మహిళ తన భర్తను తమ్ముళ్ల సహాయంతో అత్యంత కిరాతకంగా హతమార్చింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్స్‌ కాలనీలో జరిగింది.

జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్స్‌ కాలనీకి చెందిన గుజ్జ ప్రవీన్‌ (38) మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో అతని భార్య, ముగ్గురు బావమరుదులు కలిసి అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఇటుకలతో, కర్రలతో విచక్షణా రహితంగా కొట్టి చంపేశారని కుటుంబ సభ్యులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. భూ తగాదాలే హత్యకు కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:భారీగా నకిలీ విత్తనాలు పట్టివేత... ఇద్దరు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details