Doctor cheated his wife: సూర్యాపేట అంజనాపురి కాలనీలో నివాసం ఉంటున్న ఓ డాక్టర్‌ను ఆయన భార్య, ఆమె తరపు కుటుంబ సభ్యులు కలిసి దేహశుద్ధి చేశారు. ఖమ్మంకు చెందిన భానుప్రకాశ్ నాయక్‌కు హైదరాబాద్‌కు చెందిన ప్రియాంకకు 2012లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి 7ఏళ్ల బాబు, 5 సంవత్సరాల పాప ఉంది. ప్రియాంక ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు... అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో కోర్టును ఆశ్రయించింది. కుటుంబ కలహాలతో ఐదేళ్లుగా భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్న నేపథ్యంలో.. భర్త మరోక్క అమ్మాయిని మూడేళ్ల క్రితం వివాహం చేసుకొని రహస్యంగా కాపురం పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక, ఆమె బంధువులు... భర్తతో పాటు రెండో భార్య అయిన దేవికను చితకబాదారు.
డాక్టర్ రహస్య కాపురం... దేహశుద్ధి చేసిన మొదటి భార్య - doctor mainrtaining secretly secong family
Doctor cheated his wife: అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను, పిల్లలను వదిలేసి వేరే మహిళతో రహస్యంగా కాపురంపెట్టిన ఓ డాక్టర్‌కు దేహశుద్ధి చేశారు. జనాలకు వచ్చిన రోగాలను నయం చేసే గౌరవనీయమైన వృత్తిలో ఉన్న డాక్టర్‌కు పట్టిన డబ్బు జబ్బు వదిలిస్తామంటూ... భార్య, ఆమె తరపు బంధువులు చితకబాదారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
పెళ్లి సమయంలో ఇరవై లక్షల నగదు, బంగారం కట్నంగా ఇచ్చామని.. అయినా అవి సరిపోలేదని గొడవ చేస్తే తమ పుట్టింటి వాళ్లు హైదరాబాద్‌లో రెండు ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారని ప్రియాంక తెలిపింది. అయినా శాంతించని అత్తింటివారు.. ఇంకా అదనపు కట్నం కావాలని వేధించడంతో గత్యంతరంలేక కోర్టుని ఆశ్రయించినట్టు వివరించింది. భర్తతో కలిసి ఉండేందుకు ఎన్నో సార్లు పెద్దమనుషులతో పంచాయితీ పెట్టించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. కోర్టులో కేసు నడుస్తుండంగానే.. మరో అమ్మాయిని వివాహం చేసుకొని తనను మోసం చేశాడని ప్రియాంక వాపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు భానుప్రకాశ్‌తో పాటు ఇద్దరు మహిళలను స్టేషన్‌కు తరలించారు. విడాకులు ఇవ్వకుండా మరో అమ్మాయిని వివాహం చేసుకొవడంతో సదరు వైద్యునిపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: