మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం యువకుడిని బలితీసుకుంది. నాచారం పరిధిలోని ఓ మహిళ.. సోహైల్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని పోలీసులు తెలిపారు. రాత్రి భర్త లేని సమయంలో అతన్ని ఇంటికి పిలిపించుకుందని వెల్లడించారు. అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్త.. ఇద్దరినీ నిలదీయగా భార్య నాటకానికి తెరతీసిందని పోలీసులు వివరించారు.
MURDER: ప్రేమతో రమ్మంది.. భర్తతో కలిసి గొంతుకోసి ప్రియుడిని చంపేసింది! - తెలంగాణ వార్తలు
భర్త బయటికి వెళ్లాడు. ఇప్పట్లో రాడులే అనుకుంది. ప్రియుడికి కాల్ చేసింది. ఏకాంతంగా గడపొచ్చు రమ్మని ఆహ్వానించింది. ఆత్మీయురాలు రమ్మనే సరికి.. ఆగమేగాలపై వెళ్లాడు. ఇంతలోనే అనుకోకుండా భర్త వచ్చాడు. ఏం చేయాలో తెలియని ఆమె.. సరికొత్త నాటాకానికి తెరలేపింది. ఆమెపై అతడు అఘాయిత్యం చేయడానికి వచ్చాడని భర్తను నమ్మించింది. తెల్లారితే బండారం బయట పడుతుందేమోనని యువకుడిని చంపేద్దామని రెచ్చగొట్టింది. అదంతా నిజమేనని నమ్మిన భర్త ఆమెతో కలిసి ప్రియుడిని చంపేశాడు. తెల్లారే.. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం వెలుగులోకొచ్చింది. సినిమాను తలపించే ఈ విషాదం నాచారం పీఎస్ పరిధిలోని మల్లాపూర్‌లో జరిగింది.
మల్లాపూర్ హత్య కేసు, యువకుడిని హతమార్చిన దంపతులు
యువకుడు హత్యాచారం చేయబోయాడని నమ్మించి.. ఇద్దరూ కలిసి గొంతుకోసి హత్య చేశారని(MURDER) పోలీసులు వెల్లడించారు. నిందితులైన భార్యాభర్త ఇద్దరూ నాచారం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారని తెలిపారు.
ఇదీ చదవండి:TWINS RAPE CASE: తల్లి ప్రోత్సాహంతోనే బాలికలపై అత్యాచారం.. ఐదుగురికి జీవిత ఖైదు
Last Updated : Aug 17, 2021, 12:48 PM IST