సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో భార్యాభర్తలు మృత్యువాత పడ్డారు. కోదాడకు చెందిన గాదరి ఫ్రాన్సిస్(56), ఎల్లమ్మ(53) సూర్యాపేటలోని బంధువు దశదిన కార్యక్రమానికి బైక్పై వెళ్లి వస్తుండగా.. గుర్తుతెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
Accident: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి - మాధవరం వద్ద రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి
దశదిన కర్మకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం వారిని ఢీ కొట్టింది. సూర్యాపేట జిల్లా మాధవరం గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది.
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి
అతివేగంగా వచ్చి వారిని ఢీకొట్టిన వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.
ఇదీ చదవండి:Tollgate: టోల్గేెట్ల వద్ద అనుమతికి ఇక పది సెకన్లే