దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. అయిన వాళ్లు తనువు చాలిస్తే కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప... చివరి చూపునకు నోచుకోలేక పోతున్నారు మృతుల కుటుంబసభ్యులు. మంచిర్యాల జిల్లాలో భార్యాభర్తలను కరోనా మహమ్మారి కబళించింది. వారం రోజుల వ్యవధిలోనే దంపతులు మృతిచెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. సింగరేణి కార్మికుడు, ఆయన భార్య వైరస్ బారిన పడ్డారు. ఈనెల 8న ఆయన భార్యను, 12న ఆయనను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కరోనా కాటుకు భార్యాభర్తలు బలి! - తెలంగాణ వార్తలు
మంచిర్యాల జిల్లాకు చెందిన భార్యాభర్తలు మహమ్మారి కాటుకు బలయ్యారు. వారం రోజుల వ్యవధిలో దంపతులు కన్నుమూయడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
కొవిడ్‌తో భార్యభర్తలు మృతి, కరోనాతో దంపతులు మృతి
ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమె ఈనెల 18న చికిత్స పొందుతూ మృతి చెందారు. వారం రోజులు గడవక ముందే ఆదివారం ఉదయం ఆయన కన్నుమూశారు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.
ఇదీ చదవండి:'ఈ శానిటైజర్లు సుదీర్ఘకాలం పనిచేస్తాయి'