సంగారెడ్డి జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఇంట్లోనే భార్యాభర్తలు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన దంపతులు దేవరాజు(30), మమత(28). వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.
COUPLE SUICIDE: కుటుంబ కలహాలతో భార్యాభర్తల ఆత్మహత్య - wife and husband suicide news
భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న మనస్పర్థలు.. వారి పిల్లలను అనాథలు చేశాయి. క్షణికావేశంలో ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడి.. కుటుంబసభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చారు. సంగారెడ్డి జిల్లా ధర్మారంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.
వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవని స్థానికులు పేర్కొన్నారు. దీంతో మనస్తాపం చెందిన దంపతులు ఇంట్లోనే వేరువేరుగా ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి:ALLEGATIONS ON RASAMAYI: తెరాసకు కరీంపేట సర్పంచ్ రాజీనామా.. ఎమ్మెల్యే రసమయి వేధిస్తున్నారని ఆరోపణ