మైదానంలో క్రికెట్ ఆడుతూ.. ఓ యువకుడు హఠాన్మరణం పొందాడు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జరిగింది.
క్రికెట్ ఆడుతూ.. ఓ యువకుడు హఠాన్మరణం - zaheerabad methodist ground
క్రికెట్ ఆడుతూ మైదానంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో చోటు చేసుకుంది.
క్రికెట్ ఆడుతూ.. ఓ యువకుడు హఠాన్మరణం
జహీరాబాద్ మెథడిస్తు గ్రౌండ్‌లో.. మొగుడంపల్లీ మండలం ఇప్పేపల్లి-వైఎంసీ జట్లమధ్య క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుండగా.. ఇప్పేపల్లి జట్టులో బౌలింగ్ చేస్తున్న జాన్ జోషి(28) ముందుకు పడిపోయి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. హుటాహుటిన పట్టణంలోని ప్రవేటు ఆసుపత్రికి తరలించగా జాన్ జోషి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:లారీ - డీసీఎం ఢీ.. ముగ్గురు దుర్మరణం..