నరసింహమూర్తి అనే వ్యక్తి బాలానగర్ పీఎస్ పరిధిలో నివాసముంటున్నాడు. తన బావమరిది నాగేంద్ర వాట్సప్ నుంచి అర్జెంటుగా డబ్బులు పంపాలని... బ్యాంక్ వివరాలతో సహా మెసేజ్ వచ్చింది. వెంటనే నరసింహ 1.5 లక్షల రూపాయలు పంపాడు. అనంతరం తన వాట్సప్ హ్యాక్ అయిందని డబ్బులు పంపించవద్దని నాగేంద్ర... నరసింహ మూర్తికి బంధువుల ఫోన్ ద్వారా తెలిపాడు.
డబ్బులు కావాలంటూ వాట్సాప్... 1.5 లక్షలు స్వాహా - వాట్సప్ హ్యాక్
దగ్గర బంధువు వాట్సప్ నుంచి డబ్బులు కావాలని మెసేజ్ రావడంతో... డబ్బులు పంపాడు ఓ వ్యక్తి. అనంతరం తన వాట్సప్ హ్యాక్ అయిందంటూ బంధువు ఫోన్ చేసి తెలపడంతో మోసపోయానని గుర్తించి... సైబర్ క్రైంను ఆశ్రయించాడు.
డబ్బులు కావాలంటూ వాట్సాప్... 1.5 లక్షలు స్వాహా
అప్పటికే నగదు బదిలీ చేసినట్లు నరసింహమూర్తి వెల్లడించాడు. దీంతో మోసపోయానని గ్రహించి బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది హ్యాకర్ల పనేనా? లేదంటే మరెవరైనా మోసానికి పాల్పడ్డారనే కోణంలో సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:రోజుల తరబడి నిరీక్షణ.. అన్నదాతల ఆవేదన