Whatsapp DP dispute Caused Student Suicide : అధ్యాపకురాలు మందలించడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో జరిగింది. పెద్దగూడెంలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న ఆకాశ్‌రెడ్డి అనే విద్యార్థి తన తోటి విద్యార్థిని ఫొటోను తన ఫోన్లో డీపీగా పెట్టుకున్నాడు. ఇది చూసిన గణిత అధ్యాపకురాలు పోలీసులకు చెబుతానని బెదిరించడంతో మనస్తాపం చెందిన విద్యార్థి సూసైడ్ నోట్ రాసి బావిలోదూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
తోటి విద్యార్థిని ఫొటో డీపీ పెట్టాడని మందలించిన టీచర్.. విద్యార్థి సూసైడ్
Whatsapp DP dispute Caused Student Suicide : తోటి విద్యార్థిని ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టిన విద్యార్థిని అధ్యాపకురాలు మందలించారు. భయాందోళనకు గురైన సదరు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలో చోటుచేసుకుంది. అధ్యాపకురాలి వల్లే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడని.. వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.
Whatsapp DP dispute Caused Student Suicide
అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మృత దేహాన్ని తెల్లవారుజామున వెలికితీశారు. ఉపాధ్యాయురాలు హెచ్చరించడంతోనే ఆకాశ్ రెడ్డి ఆత్మహత్యకు చేసుకున్నాడని, అతని మృతికి కారణమైన గణిత టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.