What happens to missing persons: సంచలనం సృష్టించిన హాజీపూర్ దురాగతం గుర్తుందా? భువనగిరి జిల్లాలో సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి సాగించిన కిరాతకానికి ఆనవాళ్లుగా ముగ్గురు బాలికల అస్థిపంజరాలు బయటపడ్డాయి. మూడో బాలిక అదృశ్యంపై దర్యాప్తు క్రమంలో ఏళ్ల తరబడి కనిపించకుండాపోయిన మరో ఇద్దరు బాలికల మృతి ఉదంతం బయటపడింది. 2005లో కర్నూలుకు చెందిన ఓ కుటుంబం చార్మినార్‌ను చూసేందుకు వచ్చినప్పుడు రెండున్నరేళ్ల చిన్నారి తప్పిపోయింది.
ఈ చిన్నారి పేరు సంతోష్. శంషాబాద్ ఆర్‌బీనగర్‌కు చెందిన కొత్తపల్లి నరేశ్ కుమారుడు. 2012 జులైలో సోదరితో కలిసి బడికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు నాలుగేళ్ల ఆ బాలుడిని అపహరించారు. కేసు పెట్టినా పోలీసులు ఆచూకీ కనుక్కోలేకపోయారు. ఏపీలోని ఒంగోలు నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి నివసిస్తున్న నరేశ్.. ఠాణా చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
సంచలనం సృష్టించిన హాజీపూర్ దురాగతం గుర్తుందా? భువనగిరి జిల్లాలో సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి సాగించిన కిరాతకానికి ఆనవాళ్లుగా ముగ్గురు బాలికల అస్థిపంజరాలు బయటపడ్డాయి. మూడో బాలిక అదృశ్యంపై దర్యాప్తు క్రమంలో ఏళ్ల తరబడి కనిపించకుండాపోయిన మరో ఇద్దరు బాలికల మృతి ఉదంతం బయటపడింది. 2005లో కర్నూలుకు చెందిన ఓ కుటుంబం చార్మినార్‌ను చూసేందుకు వచ్చినప్పుడు రెండున్నరేళ్ల చిన్నారి తప్పిపోయింది. హుస్సేనిఆలం పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టినా, దర్యాప్తు ఏళ్ల తరబడి ముందుకు కదల్లేదు.
గత ఏడాది ఆపరేషన్ స్మైల్-7లో భాగంగా మియాపూర్‌లోని రక్షితగృహంలో ఉన్న ఆ బాలికను గుర్తించి తల్లిదండ్రుల ఒడికి చేర్చారు. ఈ రెండు కేసులు ముందుకు సాగకపోవడానికి పోలీసుల వైఖరే కారణమైతే.. సుదీర్ఘకాలం తర్వాత ఆ కేసులు కొలిక్కి రావడానికీ అదే పోలీసుల చొరవ కారణమైంది. తెలంగాణలో ఏర్పాటైన మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్లు (ఏహెచ్‌టీయూ) జటిలమైన అదృశ్యం కేసులను పర్యవేక్షిస్తున్నా పెద్దగా పురోగతి ఉండటంలేదు. పనిఒత్తిడి, ఇతర ప్రాంతాలకు వెళ్లి రోజుల తరబడి దర్యాప్తు చేసేందుకు వీల్లేకపోవడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. సంచలనం సృష్టించిన ఉదంతాల్లో మాత్రమే ప్రత్యేక దృష్టి సారించే పోలీసులు.. అలాంటి సందర్భాల్లో దాదాపు సఫలీకృతమవుతున్నారు. కేరళ పోలీసు చట్టంలోని సెక్షన్ 57 ప్రకారం.. అదృశ్యం కేసు నమోదైతే తేలేవరకు దర్యాప్తు కొనసాగించాలి. మనకూ అలాంటి చట్టం ఉండాలని కొందరు సూచిస్తున్నారు.
అదృశ్యమైన వారు ఏమవుతున్నారు?.. వ్యభిచారగృహాలు.. భిక్షాటన.. చిన్నారులను అపహరించే దుండగులు.. వారిని వ్యవస్థీకృత ముఠాలకు అమ్మేస్తుంటారు. ఆ ముఠాలు పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నాయి. బాలికలను వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నాయి. గతంలో యాదగిరిగుట్ట వ్యభిచారగృహాల్లో తనిఖీలు చేసినప్పుడు ఈ విషయం బహిర్గతమైంది. ఏళ్ల కిందట ఎక్కడో అపహరణకు గురైన బాలికలు అక్కడి కూపాల్లో మగ్గుతున్నట్లు తేలింది.
ప్రేమ పేరిట వంచన.. 15-18 ఏళ్ల వయసు బాలికలు ఎక్కువగా ప్రేమ పేరుతో వంచకులు చెప్పే మాయమాటలు నమ్మి.. ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నారు. మోసం బయటపడడం, డబ్బులు అయిపోవడం వంటి కారణాలతో తమంతట తామే తిరిగి ఇంటికి వస్తున్నారు. ఆచూకీ తెలియని కేసుల్లో పోలీసుల దర్యాప్తునకు సాంకేతిక అంశాలు అడ్డొస్తున్నాయి. అదృశ్యమైనవారు పుణ్యక్షేత్రాలు, దూర ప్రాంతాల్లో ఉంటున్న కారణంగా అక్కడికి వెళ్లి రోజుల తరబడి వెతికేందుకు సిబ్బంది కొరత కారణంగా పోలీసులు సమయం వెచ్చించలేకపోతున్నారు.