DEE Venkataramana Rao committed suicide: నిజామాబాద్ జిల్లాకు చెందిన జలవనరుల శాఖ డీఈఈ వెంకటరమణరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నవీపేట్ మండలం 'యంచ' వద్ద గోదావరి నదిలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఆర్మూర్ డివిజన్‌లో పనిచేసి కొన్నాళ్లుగా సెలవులో ఉన్న డీఈఈ.. హైదరాబాద్‌లో ఉంటున్నారు. నిన్న నిజామాబాద్‌లోని తన ఇంటికి వచ్చిన తర్వాత నవీపెట్ మండలం పోతంగల్‌లో తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. అక్కడే భోజనం చేసిన వెంకటరమణరావు.. హైదరాబాద్‌కు వెళ్తున్నానని చెప్పి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. గోదావరి నది వద్ద మోటార్ సైకిల్, చెప్పులు గుర్తించగా.... నదిలో వెంకటరమణారావు మృతదేహం లభ్యమైంది.
గోదావరిలో దూకి జలవనరుల శాఖ డీఈఈ ఆత్మహత్య - suicide case DEE
DEE Venkataramana Rao committed suicide: నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇరిగేషన్ ఇంజినీర్ వెంకటరమణరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌కి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరిన రమణారావు గోదావరిలో నిర్జీవ స్థితిలో తేలారు.
జలవనరుల శాఖ డీఈఈ ఆత్మహత్య