Ward member rapes minor girl in Nizamabad : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వార్డు మెంబర్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 28న జరిగిన కానిస్టేబుల్ రాత పరీక్ష రాసేందుకు బాధితురాలి తల్లి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమెతో సన్నిహితంగా ఉంటున్న వార్డు మెంబర్ ఆమె తొమ్మిదేళ్ల పెద్ద కుమార్తెను పట్టణంలోని ఓ అద్దె నివాసానికి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
మైనర్ బాలికపై వార్డు మెంబర్ అత్యాచారం, రక్తస్రావం కావడంతో - minor girl rape news
Ward member rapes minor girl in Nizamabad నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వార్డు మెంబర్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రిలో చేర్పించి అక్కడి నుంచి పరారయ్యాడు.
Ward member rapes minor girl in Nizamabad
బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. సిబ్బందికి తల్లి ఫోన్ నెంబర్ను అందజేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం బాధిత బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆర్మూర్ పోలీసులు తెలిపారు.