తెలంగాణ

telangana

ETV Bharat / crime

Cricket betting gang arrest: కోట్లలో బెట్టింగులు.. వాట్సప్​లో గ్రూపులు.. ముంబైలో సూత్రధారులు.. - వరంగల్ బెట్టింగ్ వార్తలు

Cricket betting gang arrest, warangal cricket betting
వరంగల్​లో క్రికెట్‌ బెట్టింగ్‌

By

Published : Nov 29, 2021, 12:44 PM IST

Updated : Nov 29, 2021, 5:44 PM IST

12:42 November 29

వరంగల్​లో క్రికెట్‌ బెట్టింగ్‌ గ్యాంగ్ అరెస్ట్.. రూ.2.05 కోట్లు స్వాధీనం

వరంగల్​లో క్రికెట్‌ బెట్టింగ్‌

Warangal Cricket betting gang arrest: Warangal Cricket betting gang arrest: పెరుగుతున్న పట్టణీకరణ, సాంకేతికతో మంచితో పాటు చెడూ పెరుగుతోంది. బెట్టింగ్‌, డ్రగ్స్ వంటి దందాలు గ్రామాలకూ పాకుతున్నాయి. వరంగల్‌లో భారీ బెట్టింగ్‌ ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న బుకీలు అభయ్, ప్రసాద్ అరెస్టు చేసి... నిందితుల నుంచి రూ.2 కోట్లకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడి కోసం ముంబయికి ప్రత్యేక బలగాలను పంపించామని వరంగల్ సీపీ తరుణ్‌ జోషి వెల్లడించారు.

పెద్దఎత్తున లావాదేవీలు

ముంబయి కేంద్రంగా ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్, పేకాట నిర్వహిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. తెలుగురాష్ట్రాల్లో గత 3 నెలల నుంచి బెట్టింగ్ ద్వారా భారీగా డబ్బు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. వివిధ బ్యాంకులకు చెందిన 43 పాసు పుస్తకాలు.. ఏటీఎం కార్డులు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వరంగల్ సీపీ తరుణ్‌ జోషి వివరించారు.

ఇలా దొరికారు..

తొలుత కరీంనగర్... ఆ తర్వాత.. హైదరాబాద్... అక్కడినుంచి వరంగల్​కు వచ్చి స్ధిరపడ్డ రెడీమేడ్ బట్టల వ్యాపారి ప్రసాద్ ఈ బెట్టింగ్​కు తెరలేపాడు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న దురాశతో రెండేళ్ల క్రితమే ఆన్​లైన్ క్రికెట్ బెట్టింగ్ ప్రారంభించాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే నిందితుడు ప్రసాద్​కు ముంబయి కేంద్రంగా... ఆన్​లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అభయ్ విలాస్ రావుతో పరిచయం ఏర్పడింది. వీరు ప్రత్యేకంగా వెబ్ సైట్ క్రియేట్ చేసి... గుట్టుచప్పుడు కాకుండా ఆన్​లైన్​ క్రికెట్ బెట్టింగ్, పేకాటల ద్వారా భారీగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. అభయ్ నిర్వహించే ఆన్​లైన్​ గేమింగ్​లో ప్రసాద్... రెండు తెలుగు రాష్ట్రాలకూ బుకీగా మారాడు. లింక్ క్రియేట్ చేసి.. దానిని ఖాతాదారులకు వాట్సాప్ ద్వారా పంపిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అభయ్ ఆన్​లైన్​లో వచ్చిన లాభాన్ని పంచుకునేందుకు... హనుమకొండ గోపాల్ పూర్​లోని ప్రసాద్ ఇంటికి వచ్చినట్లుగా సమాచారం అందుకున్న కేయూ పోలీసులు... నిఘా పెట్టి నిందితులను అరెస్ట్ చేశారు.

ప్రధాన నిర్వాహకులు ముంబయిలో ఉన్నారు. ఇక్కడ ఉన్నవారు కొందరు ఈ బెట్టింగ్​ను నిర్వహిస్తున్నారు. వారికి పాస్​వర్డ్స్ ఇచ్చారు. ఇలా ఒక లింక్ క్రియేట్ చేసి కస్టమర్లకు పంపిస్తున్నారు. మాకు 7 ఫోన్లు దొరికాయి. అన్ని ఫోన్లలో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. లింక్స్ ద్వారా కస్టమర్లు బెట్టింగ్ చేస్తున్నారు.

-తరుణ్ జోషి, వరంగల్ సీపీ

బెట్టింగ్ ప్రాసెస్

మ్యాచ్​లో విజేతలెవరు.... ఎవరికి విజయావకాశాలున్నాయి? ఓవర్ ఎలా ఉంటుందో మాత్రమే కాదు.. ఓవర్​లో బంతి, బంతికి బెట్టింగ్ నిర్వహిస్తూ ఇద్దరూ రూ.కోట్లు కాజేశారని సీపీ తరుణ్ జోషి వెల్లడించారు. పేకాట బెట్టింగ్ సమయంలో తక్కువ మొత్తం పందెం పెట్టినవారిని ముందుగా గెలిపించి... మళ్లీ వారితో ఎక్కువ మొత్తంలో పందెం కాసేలా ప్రోత్సహించి మోసం చేస్తారని పేర్కొన్నారు.

ఇటీవల టీ20 వరల్డ్ కప్ పూర్తయింది. ఇప్పుడు ఇండియా-న్యూజిలాండ్ సిరీస్ జరుగుతోంది. ప్రతీ మ్యాచ్​కు ఓవర్ టూ ఓవర్ లేకపోతే బాల్ టూ బాల్ బెట్టింగ్ చేస్తున్నారు. ఏ టీమ్​కు విన్నింగ్ ఛాన్స్ ఉంది అని బెట్టింగ్ చేస్తున్నారు.

-తరుణ్ జోషీ, వరంగల్ సీపీ

పోలీసుల ఉక్కుపాదం

క్రికెట్ బెట్టింగ్, మత్తుదందాపైనా ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు... గంజాయిరహిత వరంగల్‌ లక్ష్యంగా జిల్లాలో ప్రత్యేక కార్యచరణతో ముందుకెళ్తున్నామని చెబుతున్నారు. పాత నేరస్థులు, పాన్‌షాపుల యజమానులతో సమావేశాలు నిర్వహిస్తూ..... గంజాభూతాన్ని పారదోలేందుకు శ్రమిస్తున్నామని సీపీ తరుణ్‌ జోషి పేర్కొన్నారు. నిందితుడు ప్రసాద్... కనీసం నాలుగో తరగతి కూడా చదవలేదని సీపీ తెలిపారు. అనుభవంతో ఆన్​లైన్ బెట్టింగ్ పై పట్టు సాధించాడని వెల్లడించారు. 2019లో చందానగర్, రామచంద్రాపురంలలో రెండు కేసులు కూడా నమోదయ్యాయని సీపీ తెలిపారు. అక్రమార్జన ద్వారా సంపాదించిన డబ్బును బ్యాంకుల్లో బినామీ పేర్లతో జమ చేయడమే కాకుండా... వివిధ ప్రాంతాల్లో స్థిరాస్తులను కొనుగోలు చేసినట్లు సీపీ చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను సీపీ అభినందించారు.

'కేసులను బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. కస్టమర్లు ఓడిపోతే ఇరవై శాతం లాభాలు ఇక్కడి వాళ్లు, 80 శాతం ప్రధాన నిర్వాహకులు తీసుకుంటున్నారు. లాభాల మార్జిన్​ను బట్టీ ఈ విధంగా తీసుకుంటున్నారు.'

-తరుణ్ జోషీ, వరంగల్ సీపీ

బెట్టింగ్‌ దందా మహారాష్ట్ర కేంద్రంగా నడుస్తోందని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితులు ముంబయిలో ఉన్నట్లు గుర్తించామని..... అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పంపినట్లు తెలిపారు. యువత బెట్టింగ్‌ మాయలో పడి తల్లిదండ్రుల కష్టార్జితాన్ని అక్రమార్కుల పాలుచేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు..

ఇదీ చదవండి:Corona Cases in gurukul school: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 43మందికి పాజిటివ్

Last Updated : Nov 29, 2021, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details