వరంగల్‌లోని పోక్సో లైంగిక దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.4,500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. బాధిత బాలికకు నష్టపరిహారం కింద రూ.2 లక్షలు తక్షణమే అందజేయాలని పోక్సో కోర్టు, మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కావూరి జయకుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
హన్మకొండలోని రాంనగర్ ప్రాంతానికి చెందిన శివసాని సాయిమణిదీప్ ములుగు జిల్లా వెంకటాపూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని (15)కి యూనిట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు వేస్తానని చెప్పి మచ్చిక చేసుకున్నాడు. వార్షిక పరీక్షల అనంతరం బుద్దారంలోని తన బంధువుల ఇంటికి వెళ్లిన ఆమెను 2016 ఏప్రిల్ 29న మాట్లాడే పని ఉందని చెప్పి ద్విచక్ర వాహనంపై హన్మకొండ న్యూశాయంపేటలోని తెలిసిన వారి ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి రోజు కొత్తగూడ మండలం కుందనపల్లిలోని తెలిసిన వారింటికి తీసుకెళ్లాడు.