తెలంగాణ

telangana

ETV Bharat / crime

వరంగల్ నిట్ డిప్యూటీ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు

WARANGAL NIT DEPUTY REGISTRAR SUSPENDED వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ​లో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిట్ డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరన్​పై సస్పెన్షన్​ వేటు పడింది. నిట్ యాజమాన్యం ఆయనను సస్పెండ్ చేసింది.

వరంగల్ నిట్ డిప్యూటీ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు
వరంగల్ నిట్ డిప్యూటీ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు

By

Published : Aug 26, 2022, 9:32 PM IST

వరంగల్ నిట్ డిప్యూటీ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు

WARANGAL NIT DEPUTY REGISTRAR SUSPENDED: హనుమకొండ జిల్లా కేంద్రంలోని వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్)లో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిట్ డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరన్​పై యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. ఆయనను సస్పెండ్ చేసింది. ఈ సందర్భంగా నిట్​లో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని నిట్ యాజమాన్యం పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

నిట్ డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరన్​

ఇదీ జరిగింది..వరంగల్‌ నిట్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ ఎస్‌.వెంకటేశ్వరన్‌ రాసలీలలను ఓ మహిళా సెక్యూరిటీ గార్డు ధైర్యంగా బయటపెట్టారు. మీడియాకు, పోలీసులకు సమాచారం ఇచ్చి నేరుగా పట్టించారు. ఈ వ్యవహారాన్ని తరచి చూస్తే అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వెంకటేశ్వరన్‌ ఇప్పటికే అనేక మంది మహిళా గార్డులపై కన్నేసి వారిని వేధిస్తున్నట్టు సమాచారం. తాను మనసుపడ్డ మహిళా గార్డు దగ్గరికి వెళ్లడం, వారితో మాటలు కలిపి, తాను ఒంటరిగా ఉంటానని.. ఇంట్లో పనికి ఒక మహిళ అవసరం ఉందని వారితో సన్నిహితంగా మాట్లాడి వారి ఫోన్‌ నెంబర్‌ తీసుకుంటారు. మర్నాడు ఉదయం వారికి గుడ్‌ మార్నింగ్‌ అంటూ మెసేజ్‌ చేసేవాడు.

అన్ని వైపులా వేధింపులను తట్టుకుని..ఇటీవల వెంకటేశ్వరన్‌ ఓ మహిళా గార్డుకు తన విజిటింగ్‌ కార్డు ఇచ్చి ఇంటికి రావాలని బలవంతం చేశారు. ఆమె ఆయన మాట వినకపోవడంతో వెంకటేశ్వరన్‌ ఓ అధ్యాపకుడి సాయంతో ఆమెపై గంజాయి కేసు సైతం మోపే ప్రయత్నం చేశారు. మర్నాడు ఉన్నతాధికారులు ఆమెను పిలిపించి విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నట్టు ఫిర్యాదు వచ్చిందంటూ ఆమెను ప్రశ్నించారు. దీంతో ఆ మహిళ తనకసలు గంజాయి ఎలా ఉంటుందో కూడా తెలియదని.. డిప్యూటీ రిజిస్ట్రార్‌ తన కోరిక తీర్చాలని వేధిస్తున్నారని, ఆయన మాట విననందునే గంజాయి ఆరోపణలు తనపై మోపుతున్నారని కంటతడి పెట్టుకున్నారు. పైగా విధుల్లో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సదరు ఏజెన్సీ నిర్వాహకులకు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. చివరికి తన భర్త సాయంతో ఆయన్ను గురువారం పోలీసులకు పట్టించారు. అంతకుముందు పలువురు బాధితులు ఆయనపై దాడి చేశారు.

చర్యలు తీసుకోకపోవడంతోనే..త్వరలో తానే కీలక పదవిలోకి వస్తానంటూ చెబుతుండడంతో ఎదురుతిరిగితే తమ ఉద్యోగానికి భద్రత ఉండదనే భయంతో చాలా మంది మహిళా గార్డులు కిమ్మనకుండా వేధింపులు భరిస్తున్నట్టు వినికిడి. ఇంత జరిగినా ఆయనపై చర్యలు తీసుకోకపోవడంతో ఆగడాలు శ్రుతిమించాయి.

  • గతంలోనూ ఇతని తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గెస్ట్‌ హౌజ్‌ ఇన్‌ఛార్జిగా కూడా ఉన్న వెంకటేశ్వరన్‌ గతంలోనూ పలువురు బయటి మహిళలను వేధించినట్టు సమాచారం. నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల నియామకం జరిగే సమయంలో ఓ మహిళ నిట్‌ గెస్ట్‌హౌజ్‌లో గది బుక్‌ చేసుకొన్నారు. ఆమెతో వెంకటేశ్వరన్‌ అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన మహిళ వెంటనే గది ఖాళీ చేసి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఈయనకు నిట్‌లోని కొందరు సిబ్బంది కూడా సహకరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో పలు అవినీతి ఆరోపణలు కూడా బయటకు వచ్చాయి. ఓ టెండరు విషయంలో భారీగా వసూళ్లకు పాల్పడగా ఇతనిపై సీబీఐకు కూడా ఫిర్యాదు వెళ్లినట్టు సమాచారం.

ఇవీ చూడండి..

రాజధానిలో గుంతల వేటకు సరికొత్త విధానం, మీరు కూడా భాగస్వాములు కావచ్చు

డ్రగ్స్​ ఇచ్చి టిక్​టాక్​ స్టార్ హత్య, సీసీటీవీ ఫుటేజ్​తో తేల్చిన పోలీసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details